గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:43 IST)

దివ్యాంగులకు ఇంటికే టీకాలు వేయలేరా? కేంద్రానికి సుప్రీం నోటీసు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో వృద్ధులకు ఇంటివద్దే టీకాలు వేస్తున్నారు. అలాగే, దివ్యాంగులకు కూడా టీకాలు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. దీన్ని అపెక్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఆయోగ్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని ఈ సంస్థ కోరింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర సర్కార్‌‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.