మోడీ సర్కార్‌కు మరో దిమ్మ తిరిగే షాక్.. డోర్ టు డోర్..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌కు మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు. తాజాగా మోడీ సర్కార్ నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాల పంపిణీ కేసు నేపథ్యంలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. దివ్యాంగులకు కోవిడ్ టీకాల పంపిణీ పై సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు అయింది. ఈ దివ్యాంగులకు టీకాల పంపిణీ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ఢిల్లీ మహిళా ఆయోగ్ సంస్థ.
ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని కోరారు పిటిషనర్. ఇక పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కేంద్ర సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించక పోతే… చర్యలు తప్పవని హెచ్చరించింది.