1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media bullitin on corona bulletin in inida

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Covid Positive Cases
దేశంలో కొత్తగా మరో 30256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,78,419కి చేరింది. అలాగే, గడిచిన 24 గంటల్లో 43,938 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 295 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,133కి పెరిగింది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,27,15,105 మంది కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, ప్ర‌స్తుతం 3,18,181 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఆదివారం దేశంలో 37,78,296 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,653  క‌రోనా కేసులు న‌మోదుకాగా, 152 మంది మృతి చెందారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చైనాలో పడవ బోల్తా: 10 మంది మృతి.. 40మంది ఏమయ్యారు..?