ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:20 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : బేగంపేట్‌లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఆయన హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో మొక్కలు నాటారు. 
 
తెరాస రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించగా, ఇది నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. ఇందులో అనేక ప్రముఖులు పాల్గంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టులో అమీర్ ఖాన్ మొక్కలు నాటారు. హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా మూవీలోని సహనటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
 
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజ్‌లను మనం చూసా గానీ.. మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందరికీ అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 
 
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మంచి జీవనాన్ని అందించినవారమవుతామని చెప్పారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.