శోభనం జరుగుతుంది.. కానీ ఆ 3 రోజులూ నరకమే.. ఎక్కడో తెలుసా?
పెళ్లి అయిన తర్వాత సంప్రదాయ బద్దంగా జరిగే కార్యక్రమం శోభనం. అయితే ఆ ఐలాండ్‌లోని ఓ తెగ వాళ్లకు మాత్రం అదొక నరకం. ఎందుకంటే మూడు రాత్రులు యూరిన్ పాస్ చేయకుండా శోభనం చేసుకోవాలట. అది అక్కడి ఆచారం అలా ఉంది. ఇంతకీ ఆ మూడు రాత్రుళ్లు వాళ్లు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. శోభనం ఏర్పాట్లయితే చేస్తారు. కానీ, వారిని ఆ మూడు రోజులు ఆ గదిలోనే బంధిస్తారు. కనీసం మూత్ర విసర్జనకు కూడా వదిలిపెట్టరు. ఆ మూడు రోజులు తగినంత ఆహారం, నీళ్లు మాత్రమే ఇస్తారు. ఈ ఆచారం బోర్నియో ఐలాండ్‌లో వుంది.
బోర్నియో ఐలాండ్ ఆసియాలోనే మూడో అతిపెద్ద దీవి. సుమత్రా దీవులకు తూర్పు భాగంలో ఉన్న ఈ ఐలాండ్‌ను ఇప్పటివరకు ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. అయితే, ఇండోనేషియా, బ్రూనై, మలేషియాలకు చెందిన మూడు రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్నీ పాలిస్తున్నాయి. ఇక్కడి తీర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, ఇక్కడ పాటించే కొన్ని ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి.
బోర్నీయాలో నివసిస్తున్న కొన్ని గిరిజన తెగలు.. పెళ్లిని గొప్ప ఆచారంగా భావిస్తాయి. పెళ్లి తర్వాత వధూవరులను ఒక గదిలో బంధిస్తారు. వారిని కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వరు. అలాగని, ఆ గదిలో ఏర్పాట్లు చేస్తారని అనుకున్నా పొరపాటే. ఎందుకంటే.. ఆ మూడు రోజులు మూత్ర, మలవిసర్జనను ఆపుకోవాలి. మూడు రోజులు శోభనానికి వెళ్లే జంట నరకం అనుభవిస్తుంది. అంతే శోభనం అంటేనే అక్కడి జంటలు వణికిపోతున్నాయి.
ఈ సంప్రదాయం ఎందుకంటే.. ఇది ఎన్నాళ్ల నుంచో వస్తున్న సంప్రదాయమని బోర్నియో ప్రజలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత వధూవరులు మూత్రానికి పోయినట్లయితే.. ఇద్దరిలో ఒకరు చనిపోతారని నమ్ముతారు. అలాగే, వారికి పుట్టే బిడ్డలు పుట్టిన వెంటనే చనిపోతారని భావిస్తారు.
ఆ మూడు రోజులు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వల్ల వారి మధ్య బంధం బలోపేతం అవుతుందని చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.