సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో 4రోజులపాటు వర్షాలు: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
- భాగ్యనగరిలో కుండపోత : ఎన్నడూ లేనంత వర్షపాతం
- ఈ నెల 12న విజయవాడ - విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు.. ఎందుకంటే?
- వర్షపునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి: విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్
- నీట మునిగిన సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
ఆదివారం నుంచి మంగళవారం వరకు వాన బాదుడే బాదుడు
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం.
తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55- 65 కీమీ వేగంతో గాలులు.
ఆ తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు.
రాగల 4 రోజుల వాతావరణ సమాచారం:-
శనివారం(11-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
ఆదివారం(12-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
సోమవారం(13-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
మంగళవారం(14-09-2021):-
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు , మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
