బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:19 IST)

నడి రోడ్డుపై రెచ్చిపోయి డాన్స్ చేసిన యువతి.. చివరికి ఇలా జరిగిందే..?

Madhya pradesh
ఒక యువతి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలనే తాపత్రయంతో నడి రోడ్డుపై రెచ్చిపోయి డాన్స్ వేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినది. ప్రస్తుతం ఈ యువతి నడి రోడ్డుపై చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆ యువతి పేరు శ్రేయా కల్రా. ఈ యువతి దాదాపు మూడు రోజుల క్రితం ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్డు మీద అందరు చూస్తుండగానే చిందులు వేసింది. 
 
ట్రాఫిక్ సిగ్నల్ వద్దా రెడ్‌ సిగ్నల్‌ పడటంతో వాహనాలు ఎక్కడివి అక్కడ ఆగిపోవడంతో ఈ యువతి సడెన్‌గా రోడ్డు మీద కొచ్చి ముఖానికి మాస్క్‌ వేసుకొని తిన్మార్ స్టెప్పులేసి రచ్చ రచ్చ చేసింది. కాగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వేచి ఉన్న వారు అందరు యువతి ప్రవర్తన, డాన్స్ చూసి విస్తుపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ కోసం చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 
 
కానీ ఈ వీడియో ఇప్పుడు ఆమెకు అనుకోని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ట్రాఫిక్‌ రూల్స్ పాటించకుండా, రోడ్డుపై డాన్స్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన కారణం చేత ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఈ యువతిపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.