సంబంధిత వార్తలు
- అధైర్యపడొద్దు - డిసెంబర్ నాటికి ఇళ్ళు అందజేస్తాంః అనిల్ కుమార్ వల్లభనేని
- 43 మంది అబ్బాయిలు. 21 మంది అమ్మాయిలు.. మస్తుమజాగా రేవ్ పార్టీ... ఎక్కడ?
- కళామతల్లి చేదోడు ద్వారా సినీకార్మికులకు చేయూత
- దాసరి ఆశయాలను కొనసాగిస్తాంః వల్లభనేని అనిల్ కుమార్
- కరోనాను లెక్క చేయకుండా రేవ్ పార్టీలో జల్సా.. మహిళా పోలీస్ సస్పెండ్
హేయ్ వల్లభా... రేవ్ పార్టీలో సీఐ అసభ్య నృత్యాలు, సస్పెన్షన్
ఒక హోటల్‌లో జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా చేశారు.
ఈ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు.
అయితే జరిగిన పార్టీలో అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా ఉన్నారు. దీనితో పాటు ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్ పార్టీ జరిగిదట. ఇందులో సీ.ఐ. యువతులతో కలసి నృత్య భంగిమలు చేయడం కూడా రికార్డు కావడంతో ఆయనపై జిల్లా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటు వేశారు.
