మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 3 జులై 2021 (16:48 IST)

అధైర్య‌ప‌డొద్దు - డిసెంబ‌ర్ నాటికి ఇళ్ళు అంద‌జేస్తాంః అనిల్ కుమార్ వల్లభనేని

cine housing society
సినీకార్మికుల జీవిత కోరిక స్వంత ఇల్లు సంపాదించ‌డం. అందుకే స‌భ్యుల‌కు తెలుగు సినీ వ‌ర్క‌ర్స్ కో-ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ అంద‌జేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. కానీ కొంత‌మంది స్వార్థ‌ప‌రులు వాటిని అడ్డుప‌డేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌నీ, అటువంటివారి మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని చిత్రపురి కాలనీ హౌసింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని ఖ‌రాఖండిగా చెప్పారు. గ‌త కొద్దికాలంగా చిత్ర‌పురికాల‌నీలో డ‌బుల్ బెడ్‌రూమ్స్‌, డ్లూప్లెక్స్‌, రో హౌస్‌ల నిర్మాణంలో జాప్యం జ‌రుగుతోంది. దానికి ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవ‌డంలో సొసైటీ త‌ల‌మున‌క‌లైవుంది.ఈ విష‌యాల‌ను జ‌న‌ర‌ల్‌బాడీ స‌మావేశంలో వేలాదిమంది స‌భ్యుల స‌మ‌క్షంలో వివ‌రాలు తెలియ‌జేయాల‌ని నిర్ణ‌యించారు.

కానీ సాంకేతిక కార‌ణాలు, క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే జ‌న‌ర‌ల్‌బాడీ స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రింత‌గా వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అనిల్ కుమార్ తెలియ‌జేశారు. ఈలోగా కొంద‌రు చేస్తున్న దుష్ప్రచారం వ‌ల్ల నిర్మాణంలో వున్న ఇళ్ల‌కు అడ్డంకి ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న వాపోయారు. శ‌నివారంనాడు హైద‌రాబాద్‌లోని చిత్ర‌పురి సొసైటీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సొసైటీ క‌మిటీ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ఈ విధంగా తెలియ‌జేశారు.
 
పూర్వాప‌రాలు
-ఈ సొసైటీకి మేము మా కమిటీ ఎంతో నిబద్ధతతో చిత్త శుద్ధితో పని చేస్తుంది. 1991 లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ ల్యాండ్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 2005 లో మా చేతికి వచ్చింది. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 24 కోట్ల రూపాయల పన్నులను రద్దు చేశారు. రోశయ్య గారి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. అనంత‌రం జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టీ ఎ ఫ్లాట్ కి ఎంత రేటు అని అందరికీ చేప్పాం.
 
బైలాస్ ప్ర‌కారం ఫ్లాట్స్ ను చిత్రపురీ సొసైటీ ఏలార్ట్ చెయ్యదు. దానికి ప్ర‌భుత్వ అధికారితోపాటు సినీ పెద్ద‌ల‌తో ఓ క‌మిటీ వుంటుంది. ఆ కమిటీ నిర్ణ‌యం ప్ర‌కారం స‌భ్యుల‌కు ఎలాట్ జ‌రుగుతుంది. కమిటీ ఎంత మంచి చేసినా ఎవరోకరు ఏదోకటి అంటూనే వుంటారు. మా కమిటీ వచ్చిన తరువాత డ‌బుల్ ఇళ్ళ (ఎం.ఐ.జి.) నిర్మాణం ఆగకుండా పనులు చేయించాం. కావున MIG, douplex హౌస్ లు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఇస్తాము.
 
ఈలోగా కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని మేం అనుకున్న‌ట్లు పూర్తిచేస్తే మాకు పేరు వ‌స్తుంద‌ని చిత్ర‌పురి హౌసింగ్ లో కొందరు సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా స‌మ‌స్య‌లుంటే MiG ఫ్లాట్స్ లో అందరూ వచ్చాక బహిరంగంగా చర్చిద్దాం అని చెప్పాము.
 
ఆధారాలు వుంటే ప్ర‌భుత్వానికి తెల‌పాలి
2019 వరకు చిత్ర‌పురి క‌మిటీపై వ్య‌తిరేకంగా ఏ ఉద్యమం లేదు. కానీ క‌స్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి చిత్ర పురి సాధన సమితి నీ ఏర్పాటు చేసి ఏవో ఆరోపణలు చేస్తున్నారు. సినీ పరిశ్రమ తో సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు. ఆయ‌న‌కుతోడు మ‌ద్దినేని ర‌మేష్ అనే ద‌ర్శ‌కుడు కూడా తోడ‌య్యాడు. గ‌తంలో ఆయ‌న‌కు రోహౌస్ ఏర్పాటు చేశాం. ఆయ‌న బ్రోక‌ర్ అనే సినిమా నిర్మించాడు. ఆ త‌ర్వాత దాన్ని అమ్మేసుకున్నాడు. కానీ ప్ర‌స్తుతం మ‌ర‌లా కావాలంటున్నాడు. ఆయ‌న‌కు త్రిబుల్ బెడ్‌రూమ్‌, ఇడ‌బ్ల్యు. హౌస్‌లు వున్నాయి. అయినా ఆయ‌న ఇంకా కావాల‌ని అడ‌గ‌డం న్యాయం కాదు. అందుకే వారి వ‌ద్ద మాకు వ్య‌తిరేకంగా ఆధారాలు వుంటే గవర్నమెంట్ కి అప్పచెప్పాలి కానీ మీడియాకి పంప‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయం.
 
ఇక్కడ గొడవ చేస్తున్న వాళ్లకు ఫ్లాట్ ఇచ్చేస్తే గొడవలు వుండవు. కానీ నేను ఇందులో ఒక ఎంప్లాయ్ నీ మాత్రమే. ఫ్లాట్ ఇవ్వాలి అంటే కమిటీ మొత్తం సమ్మతం తెలపాల్సి వుంటుంది. మా కమిటీ వచ్చాక పిబ్రవరిలో ఎన్విరాన్ మెంట్ పర్మిషన్ వచ్చింది. ఎవరికి ఏ సహాయం కావాలి అన్నా మా కమిటీకి చెప్పండి పరిష్కరిస్తామని అన్నాం. కానీ కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి  కమిటీతో గొడవ పడి లబ్ది పొందడం అతని మోటో. కస్తూరి శ్రీనివాస్ ట్రిపుల్ ప్లాట్ బెడ్ రూమ్ ఇస్తే ఈ ఉద్యమం ఉండదు. ఈరోజు గొడవ చేస్తున్న వాళ్ల డిమాండ్ ను ఈ కమిటీ ఒప్పుకోకపోవడంతో ఈ రగడ. కొత్త గా గెలిచిన మా కమిటీ అంతా ట్రాన్స్పరెంట్ గా వుంది.
 
జనరల్ బాడీ మీటింగ్లో చర్చిద్దాం 
ఎలాంటి విషయాలు వున్నా జనరల్ బాడీ మీటింగ్లో చర్చిద్దాం అని చెప్పాం కానీ వాళ్ళు ఏదో ఒక కుట్రచేసి మీటింగ్ జరగకుండా చేస్తారు. ఇళ్ళ నిర్మాణానికై బేంక్‌ల‌నుంచి సుమారు 180 కోట్లు లొన్ తీసుకుంటే దానికి వడ్డీ 50 కోట్లు కట్టాము. చిత్రపురినీ అవమాన పర్చవద్దు. మేము ఒకటే చెపుతున్నాము ఎవరి దగ్గరైనా ఆరోపణలు వుంటే కమిటీ ముందు కు ధైర్యంగా రండి చర్చించండి. లేనిపోని ఆరోపణలు చేసి చిత్రపురినీ అవమాన పరచవద్దు. MiG, డుప్లెక్స్ సభ్యులకు ఈ ఏడాదికి పూర్తి చేసి ఇస్తాము. ఇవ్వకపోతే ఆరోజు మమ్మల్ని నిలదీయండి దయచేసి మేము చేస్తున్న పనులను అడ్డోకోవద్దు. సభ్యులు ఎవ్వరూ అధైర్య పడవద్దు మా కమిటీ అంతిమ లక్ష్యం సభ్యులు అందరికీ గృహ ప్రవేశాలు చేయిస్తామ‌ని తెలిపారు.