పుట్టిన నేలకు వస్తే ఆ కిక్కే వేరప్పా అంటున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ తెలుగువాడైనా తమిళ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా తమిళంలో ఓ సినిమా చేసి, దానిని తెలుగులో కూడా విడుదల చేసే ఆలోచనలో వున్నాడు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాను తమిళంలో అనువాదం చేశారు. అక్కడా ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్ స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఓ సినిమాలో ఎంట్రీ ఇవ్వాల్సి వుంది. ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అప్పుడు ఆయన తమిళంలో మాట్లాడాడు. తాను మదరాసులోనే పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో హీరోగా మారాను. అయినా పుట్టిన నేలకు వచ్చేసరికి ఆ కిక్ వేరే వుంటుందంటూ సినిమా శైలిలో కరతాళధ్వనుల మధ్య మాట్లాడారు.
తాజాగా చెప్పాలంటే, అల్లు అర్జున్ తమిళ సినిమా లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకనో కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. అయితే కలైపులి థాను బేనర్‌లో ఆయనే నిర్మించనున్న సినిమాకు ఓకే చెప్పినట్లు మెగా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు. కలైపులిథాను, మురుగదాస్ కలయికలో తుపాకి సినిమా వచ్చింది. అది మంచి హిట్. విజయ్ నటించిన ఈ సినిమా అప్పట్లోనే సీక్వెల్‌గా తీయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం విజయ్ పాన్ ఇండియా మూవీస్‌తో బిజీగా వుండడంతో అల్లు అర్జున్‌తో `తుపాకి2` వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గజని2 కూడా రాబోతుందని అప్పట్లో మెగా వర్గాలు తెలిపాయి. మరి ఏది నిజమనేది త్వరలో తెలియనుంది.