1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (20:43 IST)

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారులో మంటలు

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. అనంతరం కొద్దిసేపటికే కారు దగ్ధం అయిపోయింది. కారు ఇంజన్ నుంచి చెలరేగిన మంటలు కారును దగ్ధం చేశాయి. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో కారులో ప్రయాణం చేస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.