బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (19:12 IST)

మమతా బెనర్జీ అల్లుడు కాన్వాయ్‌పై దాడి..

తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ మేరకు తృణమూల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే బీజేపీ నేతలే అభిషేక్‌పై దాడికి దిగారని తృణమూల్ ఆరోపించింది. "బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఎలా వుందో చూడండి. సీఎం విప్లవ్ దేవ్ గారూ.... రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కొత్త శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు" అంటూ అభిషేక్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. 
 
టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్‌ హర్బర్‌ టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. 
 
ఈ మేరకు అభిషేక్‌ బెనర్జీ ట్విటర్‌లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్‌ దేవ్‌ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.