మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (18:51 IST)

ప్రధాని నరేంద్ర మోదీకి మామిడి పండ్లు పంపిన సీఎం మమత

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి... పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం హిమసాగర్‌, మాల్డా, లక్ష్మణ్‌భోగ్‌ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ మధ్య వైరం, మాటల యుద్ధం కొనసాగుతుంది. అయినప్పటికీ సహృదయ భావంతో మోదీకి మమత మామిడి పండ్లు పంపారు. 
 
ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర నేతలకు మామిడి పండ్లను బహుమతిగా పంపారు. ఇది బెంగాలీ సంస్కృతి అని గతంలో మోదీకి మమత కౌంటర్‌ ఇచ్చారు.