శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (18:19 IST)

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Sudigali Sudheer,  Divya Bharathi
Sudigali Sudheer, Divya Bharathi
తమిళ నటి దివ్యభారతి తెలుగు డైరెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసింది. దర్శకుడు నరేష్ కుప్పిలి మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమా గోట్ లో ఆమె నాయికగా నటించింది. కథానాయకుడిగా సుడిగాలి సుధీర్ నటించారు. దర్శకుడు నరేష్ తాను మహిళ కాబట్టి వివక్షకు గురి చేశాడు అని తెలియజేసింది. అక్కడే ఉన్న నటుడు సుధీర్ కూడా పట్టించుకోలేదని సంచలన ఆరోపణలు చేసింది.
 
షూటింగ్ లో తనను చిలకా అని పిలవడంపై ఇబ్బందికరంగా వుంది. అయినా హీరో సైలెంట్ గా ఉండటం తనకు బాధ కలిగించిందని ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మూవీ గోట్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి (నరేష్ కే లీ) పై తీవ్ర ఆరోపణలు చేసినా సుడిగాలి సుధీర్‌ కూడా మౌనంగా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
మహిళలను చిలక.. లేదా ఇతర పదంతో పిలవడం హాని కలిగించని జోక్ కాదు. మహిళలను పదేపదే అగౌరవపరిచాడు. నిజాయితీగా చెప్పాలంటే తాను సృష్టించాలనుకుంటున్న కళకే ద్రోహం చేశాడు  అని ఆమె ఘాటుగా అంది. నన్ను బాగా నిరాశపరిచిన విషయం ఏమిటంటే.. హీరో మౌనంగా ఉండి, ఈ సంస్కృతి మరో రోజు కొనసాగడానికి అనుమతించడం బాగా బాధేసింది.ఇది కేవలం ఛాయిస్ మాత్రమే కాదు. ఇది ఒక కళాకారిణిగా, ఒక మహిళగా నా స్టాండర్డ్  అని ఆమె రాసుకొచ్చింది. దివ్యభారతి  2021లో జి.వి. ప్రకాష్ సరసన నటించిన తమిళ చిత్రం బ్యాచిలర్ తో ఎంట్రీ ఇచ్చింది. గోట్ నవంబర్ 28న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆమె జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.