గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 20 సెప్టెంబరు 2021 (19:52 IST)

శృంగారానికి నీవు పనికిరావంటున్న భర్త, భార్య ఏంచేసిందంటే..?

భార్యాభర్తలన్నాక ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవుతూ వెళుతూ ఉండాలి. కష్టనష్టాలను ఇద్దరూ పంచుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్ళు ఉన్నా సర్దుకుపోవాలి. ఇదంతా భార్య చేస్తోంది కానీ భర్త మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉన్న భర్త కట్నం కోసం చేసే చేష్టలను తట్టుకోలేక పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కింది ఓ భార్య.
 
గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాకు చెందిన 27 యేళ్ళ వ్యక్తికి 25 యేళ్ల మహిళను ఇచ్చి పెళ్లి చేశారు. గత నెల 27వ తేదీ వీరికి వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో 10 లక్షల రూపాయల నగదుతో పాటు 25 సవర్ల బంగారాన్ని ఇచ్చారు.
 
దాంతో పాటు మరో 5 సవర్ల బంగారు, 5 లక్షల నగదును మరో నెలరోజుల్లో సర్దుతామని చెప్పారు. కానీ పెళ్ళయిన తరువాత ఆ డబ్బును సర్దలేదు. పెళ్ళయిన వారంరోజుల పాటు భార్యతో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ భర్త ఆమెతో శృంగారం చేయడం మానేశాడట.
 
నేరుగా బెడ్రూంలో భర్త దగ్గరకు వెళితే నువ్వు శృంగారానికి పనికిరావు వెళ్ళిపో అంటున్నాడట. కట్నం కోసం తల్లిదండ్రులు చెప్పే మాటలనే వింటున్నాడని.. తనను భర్త సుఖపెట్టడంలేదన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిందట ఆ వివాహిత.
 
ఇదే విషయాన్ని పోలీసులకు వివరించింది. దీంతో భర్తతో పాటు అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిందట బాధితురాలు.