బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (18:04 IST)

డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్‌: వీడియో వైరల్‌

Bullet bandi song
బుల్లెట్‌ బండి సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అక్కడక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ పాటకు కాలు కదిపారు.. ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్‌ మాత్రం తగ్గడంలేదు.. తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి.. డుగ్గు డుగ్గు పాటకు స్టెప్పులు వేశారు.. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
 
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెళ్లిరోజు సందర్భంగా.. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఆయన నివాసంలో ఫ్యామిలీ పార్టీ జరిగింది.. ఈ వేడుకల్లో నారాయణస్వామి సతీమణి, కుమార్తె బుల్లెట్ బండి పాటకు కాలు కదిపారు.. నారాయణ స్వామి సోఫాలో కూర్చొని ఉండగా.. ఆయన భార్య, కుమార్తె డాన్సువేశారు. 
 
నారాయణస్వామి దగ్గరకు వెళ్తూ.. స్టెప్పులేసిన ఆయన సతీమణి.. పెళ్లిరోజు సర్ ప్రైజ్ ఇచ్చారు.. డిప్యూటీ సీఎం ఆనందంలో మునిగిపోయినా.. సోఫాలోనే కదలకుండా ఉండిపోయారు.. కొద్దిసేపు స్టెప్పులు వేసిన ఆయన సతీమణి.. చివరకు ఆయన కౌగిట్లో వాలిపోయారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.