రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో
Kantara Chapter 1 shooting complete
ఈరోజు, నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్ 1 మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దాదాపు 250 రోజుల షూటింగ్, మూడు సంవత్సరాల కష్టం అంతా మిక్స్ అయిన ఈ వీడియో ఒక సినిమాటిక్ ఫెస్టివల్‌లా కనిపిస్తుంది.
కేవలం బీహైండ్ ది సీన్స్ అనిపించకుండా సినిమా పుట్టిన తీరుని అద్భుతంగా చూపించారు. విభిన్న భూభాగాలు, కాంప్లెక్స్ సెటప్‌లలో పనిచేసే భారీ టీం కలిగి ఉన్న ఈ వీడియో రిషబ్ శెట్టి డెడికేషన్‌కు ట్రీబ్యూట్ లా వుంది.
సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న బి. అజనీష్ లోకనాథ్ ఆల్రెడీ తన స్పిరిచువల్ టచ్ తో అద్భుతం అనిపించారు. డివోషనల్ విజువల్స్ ను ఆర్ట్ డైరెక్టర్ వినేష్ బంగ్లాన్ అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ విషయంలో అరవింద్ కాశ్యప్ వర్క్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
అక్టోబర్ 2న గ్లోబల్ రిలీజ్ కానున్న ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రానుంది.
కాంతార చాప్టర్ 1 తో హోంబాలే ఫిల్మ్స్ భారతీయ సినిమాలో సరిహద్దులను దాటే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది, స్టొరీ టెల్లింగ్, సినిమాటిక్ ఎక్సలెన్స్‌ను బ్లెండ్ చేసి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
