సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:14 IST)

స్నేహితుడి భార్యతో ఎఫైర్, పెళ్ళికి ఒప్పుకోని ప్రియుడు, ఆ వీడియోలను రికార్డ్ చేసి...

అతను ఆర్మీ ఉద్యోగి. విధి నిర్వహణలో చనిపోయాడు. అతని స్నేహితుడు అంతకుముందు తరచూ ఇంటికి వెళ్ళివాడు. ఆ పరిచయం కాస్త అతడి భార్యతో మరింత సన్నిహితంగా వుండేందుకు మార్గమైంది.

స్నేహితుడు మరణించిన తరువాత అతని భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ నిలబెట్టుకోలేదు. తప్పించుకు తిరుగుతున్న ఆర్మీ ఉద్యోగిని రెడ్ హ్యాండెండ్‌గా ఆర్మీ ఉన్నతాధికారులకు పట్టించింది వివాహిత.
 
చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయ్ పూర్‌కు చెందిన చురేంద్ర దేవ్ ఆర్మీ ఉద్యోగి. తన స్నేహితుడైన మరో ఆర్మీ ఉద్యోగితో కలిసి అతని ఇంటికి వెళ్ళేవాడు. అక్కడే షాలినితో పరిచయం ఏర్పడింది. విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించాడు షాలిని భర్త. దీంతో ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు.
 
ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్‌తో ఆమె కూడా అతనికి దగ్గరైంది. పెళ్ళి చేసుకుంటానని చేతిలో చెయ్యేసి చెప్పడంతో ఆమె నమ్మింది. దీంతో అతనికి సర్వస్వం అర్పించింది. పెళ్ళి మాటెత్తితే చాలు ఈరోజు... రేపు అంటూ ఏదో ఒకటి చెబుతూ ఉండటంతో షాలినికి అనుమానం వచ్చింది.
 
ప్రియుడు తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను చిత్రీకరించి ఏకంగా ఆర్మీ ఉన్నతాధికారులకు చూపించింది. దీంతో ప్రియుడి ఉద్యోగం ఊడిపోయింది. ప్రస్తుతం కటాకటాల పాలయ్యాడు.