గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:13 IST)

త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు.. మహారాష్ట్రకు రూ.కోటి అపరాధం

సుప్రీంకోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా, జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు కలువకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. కానీ, ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 
 
జ్యోతిర్లింగ ప్ర‌దేశం త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా చూడాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స్థానిక ప్ర‌భుత్వం విస్మ‌రించింది. దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కోటి రూపాయల అపరాధం విధించింది. మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోటి జ‌రిమానా విధించారు.