Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్
Sai Durgatej, Tirumala Swamy's darshan
మెగాస్టార్ కుటుంబం హీరో సాయి దుర్గతేజ్ తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడి మీడియా అడిగిన పలుప్రశ్నలకు సమాధానాలిచ్చారు. దేవుని క్రుపతో మరో జన్మ ఎత్తానని పేర్కొంటూ.. స్వామివారికి క్రుతజ్నతగా ఆనందపరశంతో దర్శించుకున్నానన్నారు. మంచి చిత్రాలు,మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను. అలాగే రాబోతున్న కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నాను అన్నారు.
ఈ సందర్భంగా తన వివాహం గురించి కూడా స్పందించారు. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకుంటానని తెలిపారు. ప్రేమ వివాహమా, బయట సంబంధం అనే మాటకు దాటవేశారు. వచ్చే ఏడాది నేను నటించిన సంబరాల ఏటిగట్టు చిత్రం వస్తోంది. మీ ఆశీస్సులు కావాలని కోరారు.
గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లో పోలీస్ యంత్రాంగం, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించే పనుల్లో ఆయన పాల్గొంటున్నారు. మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల గురించైనా మన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. బైక్ పై వెళుతున్నప్పుడు హెల్ మెట్ తప్పనిసరిగి ధరించండి. రూల్స్ పాటించండి అంటూ గుర్తు చేస్తున్నారు.