గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (14:17 IST)

85 మంది ఖైదీలకు HIV+.. కారణం ఏంటంటే?

అస్సాంలోని నాగావ్ సెంట్రల్ జైలు, స్పెషల్ జైలులో మొత్తం 85 మంది ఖైదీలకు సెప్టెంబర్‌లో హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించబడ్డారని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీలలో ఏకంగా 85 మంది హెచ్ఐవీ బారినపడడం  జైలు అధికారులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
అయితే, వీరంతా డ్రగ్స్‌కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి ఉంటుందని చెప్తున్నారు.
 
నాగావ్ బిపి సివిల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ సి నాథ్ మాట్లాడుతూ.. హెచ్ఐవి పాజిటివ్ పరీక్షించిన 85 మంది ఖైదీలలో, 45 మంది ప్రత్యేక జైలుకు చెందినవారు. మిగతా 40 మంది నాగావ్ పట్టణంలో ఉన్న సెంట్రల్ జైలుకు చెందినవారని తెలిపారు.