1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:41 IST)

దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి.. కొందరు వ్యక్తులు అదే పనిగా..?

దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్‌, మహమ్మద్‌ సాదీక్‌, గడ్డం నందు, బోగె రాయలింగు అనే వ్యక్తులు కొద్దిరోజులుగా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు జైపూర్‌ ఎస్సై రామకృష్ణ తెలిపారు. 
 
రెండు రోజుల క్రితం బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.