శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:53 IST)

వీర్యంతో నిండిన ఇంజెక్షన్‌ను ఓ మహిళకు వేశాడు.. అంతే ఆ వ్యక్తి ఏమయ్యాడంటే?

ఓ వ్యక్తి ఓ సూపర్ మార్కెట్ వద్ద ఓ ఇంజక్షన్‌ను తీసుకొచ్చాడు. ఆ ఇంజక్షన్ అంతా కూడా వీర్యంతో నిండి ఉంది. దానిని అతను ఒక మహిళకి ఎక్కించాడు. దీనితో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.

వివరాల్లోకి వెళితే.. థామస్ భైరాన్ స్టామిన్, 51 ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళాడు. అక్కడికి ఒక ఆమె షాపింగ్ చేయడానికి వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి 18న యూఎస్‌లో ఈ సంఘటన జరిగింది. 
 
అయితే సూపర్ మార్కెట్ కి వచ్చిన ఆమెకి అతను ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్ మొత్తం కూడా వీర్యంతో నిండి ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి మహిళ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కార్డు పట్టుకొని వెళుతుండగా ఆ వ్యక్తి వెనక నుండి ఆమెకి సిరంజిని ఇచ్చాడు.
 
అసలు ఏమైంది అని ఆమె చూసుకునే సరికి మొత్తం జరిగిపోయింది. ఈ ఇంజక్షన్ చేసిన వ్యక్తి జీన్స్ వేసుకుని బ్లూ స్వెటర్ వేసుకున్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఈమె షాప్ నుండి బయటికి వెళ్లి కార్‌లో ఉన్న తన కొడుకుని పిలిచింది. ఆమెకి కాస్త నొప్పిగా అనిపించడంతో ఆమె ఆ గాయాన్ని చూసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని తన ఇంటిని కూడా చెక్ చేశారు. అలాంటి సిరంజిలు ఇంట్లో ఉన్నట్లు కూడా పోలీసులు గమనించారు. ఆ తర్వాత పదేళ్ల పాటు జైలు శిక్ష అతనికి విధించారు.