శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:24 IST)

కుప్పకూలిన వంతెన: 30 మంది విద్యార్థులకు గాయాలు

bridge collapses
అసోంలో వేలాడే వంతెన కుప్పకూలిన ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం కరీంగంజ్ జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరగి ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్ని గ్రామంతో కలుపుతుంది. విద్యార్థులు, స్థానికులు అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు.
 
సోమవారం సాయంత్రం చెరగి విద్యాపీఠ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై నడుస్తున్న విద్యార్థులు నదిలో పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో పడిపోయిన విద్యార్థులను రక్షించారు. వేలాడే వంతెన మూడేండ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు చెప్పారు.