గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:07 IST)

నిర్మాణంలో వున్న ఫ్లైఓవర్ కుప్పకూలింది... 14 మందికి గాయాలు

ముంబై మహానగరంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. స్థానిక బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్తతగా ఓ వంతెనను నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ ఫ్లైఓవర్‌లోని ఓ భాగం శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు జోరుగా సాగిస్తున్నారు.