Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్
Ram Gopal Varma - Showman
ఆర్జీవీతో ఇంతకుముందు "ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2" చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. రాంగోపాల్ వర్మ హీరోగా... సుమన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నూతన్.
