ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (09:52 IST)

మరోమారు పెరిగిన పెట్రోల్ ధరలు - ముంబైలో రికార్డు స్థాయి ధర

దేశంలో ఇంధన ధరలకు ఇప్పట్లో కళ్లెం పడేలా కనిపించడం లేదు. బుధవారం కూడా మరోమారు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఫలితంగా దేశ రాజధానిలో ఈ ధరలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. 
 
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67కుచేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.83, డీజిల్‌ రూ.100.92, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.46, డీజిల్‌ రూ.99.78గా ఉన్నాయి. తాజాగా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు అధికమై రూ.112.27, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరాయి.