మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (10:37 IST)

భారత్ ఘనత.. అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్‌ పరీక్ష సక్సెస్

Agni 5 Missile
దేశ ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటేలా చేసింది భారత్. భారత దేశం రక్షణ రంగంలో మరో పెద్ద ఘనతను సాధించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్‌ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అక్టోబర్ 27, 2021న రాత్రి 7.30నిమిషాలకు పరీక్షించారు. 
 
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్షిపణి ప్రయోగం 2020లోనే జరుగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా వాయిదా పడింది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఇండియా ఈ పరీక్ష చేయడం ఆసక్తిగా మారింది.
 
అగ్ని-5 సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. గతంలోని అగ్ని-1,2,3,4లకు మించి అదనపు సామర్థ్యాన్ని ఈ క్షిపణి కలిగి ఉంటుంది. ఇతరులు మన దేశంపై దాడి చేస్తే తప్ప ముందుగా ఈ క్షిపణులను వాడొద్దనేది ఇండియా కట్టుబాటు.
 
ప్రస్తుతం చైనా సరిహద్దు వెంట ఉన్న పరిస్థితులు, బార్డర్‌పై చైనా కొత్త వ్యవహర శైలీ ఇండియాకు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్షిపణి సామర్థ్యం 5000 కిలోమీటర్లు అంటే చైనాలో దాదాపు ప్రతీ చోటకు వెళ్లేలా దీన్ని ప్రయోగించవచ్చనే వాదనలు ఉన్నాయి.