దేశ ఐటీ క్యాపిటల్‌లో కొత్త కరోనా వేరియంట్
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. ఏవై.4.2 అనే రకం వైరస్ కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు.
మరోవైపు, ఇదే తరహా వైరస్ కేరళ రాష్ట్రంలో కొత్తగా 7 వేల మందికి కొవిడ్ సోకింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 482 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో దేశంలో ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది.
కర్నాటకలో సోకిన ఏడుగురు బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు వివరించారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని చెప్పారు. ఏవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు.