గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (22:21 IST)

ఉత్తర కర్ణాటకలో ప్రకంపనలు: రిక్టర్‌ స్కేల్‌పై 3.6గా తీవ్రత

ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని విజయపుర జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10.29 గంటల సమయంలో విజయపురలోని ధనరంగిలో ప్రకంపనలు వచ్చాయని కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. విజయపురలోని ధనరంగికి వాయువ్యంగా 2.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. 
 
అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు భూకంపాలు సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతకు ముందు బీదర్‌, కలబురిగిలో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో వరుస భూకంపాలపై అధ్యయనం చేసేందుకు భూగర్భ శాస్త్రవేత్తల బృందాన్ని పంపారు.