సంబంధిత వార్తలు
- సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ ఓ గే : శ్రీరెడ్డి కామెంట్స్
- ఇంటి వద్ద దింపుతామని నమ్మించి మహిళపై అత్యాచారం..
- వారంలో కుమార్తె పెళ్లి .. తండ్రిని కబళించిన రోడ్డు ప్రమాదం
- చిరును పిలవలేదని బాలయ్య అలిగాడా? మంచు విష్ణు ఫంక్షన్‌కి 'సింహా' హ్యాండ్
- మన్మోహన్‌కు డెంగీ జ్వరం : మాండవీయ చేసిన పనికి కుమార్తె ఫైర్
బెళగావి జిల్లాలో యువకుడిపై వ్యక్తి అత్యాచారం
కర్నాటక జిల్లాలో యువకుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బైక్‌పై డ్రాప్ చేస్తానని బాధితుడిని నమ్మించిన నిందితుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి, అతనిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బెళగావి జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు హోటల్లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. రోజులానే అతడు అక్టోబరు 5వ తేదీన తన పని పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు.
ఆ సమయంలో అథణి తాలుకాలోని సంకొనట్టి గ్రామానికి చెందిన రాజు అచారకట్టి అక్కడికి బైక్‌పై వచ్చాడు. రాజు ఆ యువకుడిని 'తన బైక్‌పై డ్రాప్ చేస్తాను రమ్మని' పిలిచాడు. దాంతో రాజు మాటలను నమ్మిన బాధితుడు బైక్‌పై ఎక్కాడు.
అయితే బాధితుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితుడు అక్కడ అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీనిపై అథణి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
