సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఖమ్మం జిల్లాలో బోల్తాపడిన ట్రాక్టర్ ... నలుగురు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. దుర్గాదేవి విగ్రహ నిమజ్జన ఉత్సవానికి భక్తులు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా బోల్తాపడింది. 
 
ముదిగొండ మండలం బాణాపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉంచగా, వెనుక ఉన్న మరో ట్రాకట్ర్ వల్లభి వైపు వెళ్లింది. అయితే, ట్రాక్టర్ అతివేగానికి తోడు వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం.