మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (12:18 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి లక్నో మీదుగా వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సును దేవా కొత్వాల్ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇక ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.