మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.