శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:44 IST)

సచివాలయంలో భారీ స్కామ్ : సీఎం ఫండ్‌ నిధులు స్వాహా చేసిన సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలనా కేంద్రంగా ఉండే సచివాలయంలో భారీ స్కామ్ జరిగింది. సీఎం రిలీఫ్ ఫంఢ్ నిధులను స్వాహా చేశారు. ఈ పనికి పాల్పడింది కూడా ఇంటి దొంగలే కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలోని పేద లబ్దిదారుల వివరాలను సేకరించిన సచివాలయ సిబ్బందిలో కొందరు.. ఈ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు ఏసీబీ విచారణలో వెల్లడైంది. 
 
ఈ స్కామ్‌లో ఏకంగా 50 మంది సిబ్బంది వరకు కుమ్మక్కైనట్టు సమాచారం. ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
ఇప్పటికే.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది.. ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.