బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:30 IST)

జనసేన నాయకుడి కారుపై ఎమ్మెల్యే జోగి అనుచరుల దాడి

ఇటీవల తెలుగుదేశం అధినేత ఇంటిపైకి వెళ్లి, వివాదాస్ప‌దం అయిన పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఇపుడు మ‌రో వివాదాంలో చిక్కుకున్నారు. ఆయ‌న అనుచ‌రులు త‌న‌పై దాడి చేశార‌ని జ‌న‌సేన నాయ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
 
పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును ఈ తెల్ల‌వారుజామున గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. త‌న‌పై దాడి చేయడానికి వ‌చ్చిన వారే కారును ధ్వంసం చేశార‌ని ఆ నాయ‌కుడు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ దాడికి పాల్ప‌డ్డారు. 
 
పెడన పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆ హోటల్ లో రామ్ సుధీర్ బస చేస్తుండగా, బయట అగి ఉన్న కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అనుచ‌రుల‌ని జ‌న‌సేన నాయ‌కుడు ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ అనుచరులు తనపై దాడి చేశారు అంటూ పోలీసులకు రామ్ సుధీర్ ఫిర్యాదు చేశారు.