ట్రూ అప్ కరెంటు ఛార్జీలపై మండిపడిన జనసేన కార్యకర్తలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన ట్రూ అప్ అదనపు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. కృష్ణా జిల్లా మైలవరం, ఇబ్రహీంపట్నం, జి కొండూరు, గొలపూడి, రేడ్డి గూడెం మండలాల కరెంట్ సబ్ స్టేషన్ల వద్ద జనసేన కారకర్తలు ధర్నాలకు దిగారు. విద్యుత్ ఎఇ, ఏడిఇ. లకు ట్రూ అప్ ఛార్జీలపై వినతి పత్రం అందించారు.
జనసేన ఇన్ చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధి) మాట్లాడుతూ, కరోనా కష్ట కాలంలో ప్రజలు పనులు లేక ఆర్ధికంగా ఇబందులు పడుతుంటే, ట్రూప్ ఛార్జిలు పేరుతో అధిక వసూలు చేయటం తగదని సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ తరుపున హితవు చెప్పారు. ఇప్పటికి ధర్నాలతో సరిపెడుతున్నామని, ట్రూఅప్ ఛార్జీలను తగ్గించకపోతే, ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు వై.ఎన్.ఆర్. బి. శ్రీకాంత్, పి. ప్రకాష్, లక్ష్మి,. తేజ కృష్ణ, నరసింహ, బి. శ్రీనివాస్, సుందరరామి రెడ్డి, బ్రహ్మయ్య, సురేష్, కోలా రాజు, బోలా రాజు, శాంతా కుమారి, బాబి, ప్రవీణ్, పార్థసారధి, రామాంజనేయులు, కిషోర్, జానీ, శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.