Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !
Director Gautham Tinnanuri
ఈ సినిమాకు ముందు వేరే హీరోలను ఇద్దరినీ అనుకున్నా వారు కాదనడంతో విజయ్ కు వచ్చింది. అదేవిధంగా అందులో ప్రధాన విలన్ గా చేసిన మలయాళనటుడు రమేష్ కూడా తన అసిస్టెంట్లు చెప్పడంతో ఆయన గత సినిమా చూసి ఎంపిక చేశానని దర్శకుడు చెప్పారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా చేయాలంటే రమేష్ ను ట్విన్స్ గా పెట్టి సినిమా తీయాలి. మొదట్లో రెండు భాగాలు అనుకున్నారు. కానీ ప్రస్తుతం సాహసం చేయడంలేదని సినీ వర్గాల టాక్.
దానితో తన దగ్గర వున్న కథలకు వేరే హీరోలను సంప్రదిస్తున్నా డేట్స్ ఖాలీలేవని మాట వినిపిస్తుంది. ఈసారి చిన్న హీరోతో చేయాలని అనుకుంటున్నాడట. జెర్సీ తర్వాత రామ్ చరణ్‌తో చర్చలు జరిపాడు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. పెద్ద స్థాయి చిత్రాలకంటే చిన్నపాటి హీరోలతో చేయాలనుకుంటున్నట్లు టాక్.
