బుధవారం, 13 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2025 (16:07 IST)

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి ఓనమ్.. సాంగ్

Onam.. Song on KirRan Abbavaram, Yukti Tareja
Onam.. Song on KirRan Abbavaram, Yukti Tareja
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు " K-ర్యాంప్"  సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాయగా, ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేసి సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. 'ఓనమ్' లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే - ' ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా, ఫోనే మార్చేశానే, ఛాటింగ్ ఆపేశానే, నీకే సింక్ అయ్యానే వదలను ఇల్లా..వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే, లెఫ్టే ఉన్న గుండె రైటు రైటందే...' అంటూ మాస్ మెలొడీతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. కేరళ పండుగ ఓనమ్ సందడి అంతా ఈ పాటలో కనిపించింది. 'ఓనమ్' పాటలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా మాస్ స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి.