ఆదివారం, 10 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2025 (17:53 IST)

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

The Paradise, Nani Look
The Paradise, Nani Look
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ 'ది ప్యారడైజ్' లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ విడుదలై అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. నాని నెవర్ బిఫోర్ లుక్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
 
రగ్గడ్ మీసం, గెడ్డం, రెండు జడలతో కనిపించిన నాని అదిరిపోయే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ రెండు జడలే ఆయనకు పేరుగా మారాయి.  ఇందులో ఆయన పాత్ర పేరు "జడల్". పేరు చాలా యూనిక్ గా వుంది. పోస్టర్ కంపోజిషన్ మరింత ఫైర్‌ పెంచింది. ఆయన వెనక, కత్తులు-బుల్లెట్లతో తయారైన ఒక భారీ రౌండ్ వీల్ ఒక రకమైన డేంజర్ ని చూస్తోంది. పొగమంచులో ఎగిరే కాకులు ప్రతి ఎలిమెంట్‌లోనూ సింబాలిజం కట్టిపడేస్తోంది.“It started as a braid. It ended as a revolution.” అనే క్యాప్షన్ మరింత క్యురియాసిటీ పెంచింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
ఇటీవల వచ్చిన "రా స్టేట్మెంట్" గ్లింప్స్ తర్వాత ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్‌కి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు నాని ఫస్ట్ లుక్‌తో, ఆ అంచనాలను మేకర్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. డైరెక్టర్ శ్రీకాంత్‌ విజన్, డీటైలింగ్ గురించి దేశం మొత్తం మాట్లాడుతోంది. కేవలం పోస్టర్ కంటెంట్‌తోనే హైప్ మల్టీఫోల్డ్‌గా పెరిగిపోయింది.
 
దసరా తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి చేస్తున్న ఈ సినిమా, హైదరాబాద్-సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది.
 
ఈ చిత్రంలో రాఘవ జూయాల్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సి. సాయి, ఎడిటింగ్‌ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా చేస్తున్నారు.
 
ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్  మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ, కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది. యూనివర్సల్ కంటెంట్‌తో పాన్-వరల్డ్ రిలీజ్ అవుతూ భారతీయ సినిమాను గ్లోబల్ మ్యాప్‌లో మరింత ఎత్తుకు తీసుకెళ్లనుంది.