గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 అక్టోబరు 2021 (12:01 IST)

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఈరోజు ఉదయం బస్సు- కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. 14 మంది గాయపడ్డారు. భింద్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఉన్న హైవేపై ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
 
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సులోని వ్యక్తులు గ్వాలియర్ నుండి మధ్యప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి ప్రయాణిస్తున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.