1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:38 IST)

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో మంగళవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 
 
మంగళవారం మార్కెట్ రేట్ల ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.150 పెరిగి రూ.43,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.160 పెరిగి రూ.47,290కి చేరిది. బంగారం ధ‌ర‌లు పెరగగా… వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ.64,400 వ‌ద్ద కొనసాగుతోంది.
 
ఇకపోతే, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,290 ఉంది.
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280 ఉంది.