సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:51 IST)

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...

అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు వున్నట్లు గనుల శాఖ నిర్థారించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 టన్నుల బంగారం వుంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు వుండవచ్చని తెలిపారు.
 
ఇంకా రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు బంగారం వుంటుందని చెప్పారు. ఒక టన్ను మట్టి తవ్వి తీస్తే 4 గ్రాముల బంగారం లభిస్తుందని చెపుతున్నారు. ఐతే భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత లోతుకు వెళ్లేకొద్దీ బంగారు నిక్షేపాలు అధికంగా వున్నట్లు గుర్తించారు.