హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదు.. మరో బాంబు పేల్చిన తాలిబన్లు
ఓ పక్క మారిపోయామంటూనే తమ పాత ధోరణిని పాటిస్తున్న తాలిబన్లు అఫ్గన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమ నగరం హెరాత్‌లో కిడ్నాప్‌కు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను చంపి ఆ మృతదేహాలను తాలిబన్లు బహిరంగంగా వేలాడదీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆప్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు మరో బాంబు పేల్చారు.
దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని నిషేదించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు.
దాంతోపాటు షాపులలో ఆధ్యాత్మిక పరమైనవి కాకుండా ఇతర సంగీతం వినిపించకూడదని హకుం జారీ చేశారు. తాలిబన్ల పాలానా విధానం చూస్తే వారు పాత ధోరణినే కొనసాగిస్తున్నట్లు ఆ మీడియా పేర్కొంది.