శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:07 IST)

Bharat Bandh: జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులపై రైతుల నిరసన

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు రైతు సంస్థలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. పలు రాష్ట్రాలు భారత్ బంద్‌కి మద్దతు ప్రకటించాయి.
 
పంజాబ్, హర్యానా రెండింటిలోనూ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, లింక్ రోడ్, రైల్వే ట్రాక్‌లు పూర్తిగా బ్లాక్ చేయబడ్డాయి. రహదారి, రైలు ట్రాఫిక్ నిలిచిపోయింది. పంజాబ్‌లో రైతులు నిరసనలు చేపట్టారు. పంజాబ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నిరసన ప్రదేశాలలో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని పోలీసు బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలో కూడా జింద్ జిల్లాలో 25 చోట్ల హైవేలు బ్లాక్ చేయబడ్డాయి.
 
సమ్మె వ్యవధిలో, ప్రభుత్వ కిసాన్ మోర్చా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు మరియు వాణిజ్య సంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చింది. ఐతే అన్ని అత్యవసర సంస్థలు, అత్యవసర సేవలు, ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు, రిలీఫ్, రెస్క్యూ వర్క్, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు హాజరయ్యే వ్యక్తులు మినహాయించబడతారు.