సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:39 IST)

భారత్‌ బంద్‌కు రైతు సంఘాల పిలుపు - మద్దతు ఇచ్చిన ఏపీ

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ ఈ నెల 27వ తేదీన భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
 
ఈ బంద్‌లో ఆర్టీసీ కూడా మధ్యాహ్నం వరకూ పాల్గొంటుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 35 మంది ఆత్మబలిదానాలు వృధా కాకూడదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు. 
 
రైతుల ప్రయోజనాలే టీడీపీకి ప్రధానమన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకలు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తమ ఎంపీలు పార్లమెంట్​లోగళం విప్పారని గుర్తు చేశారు. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్​కు మద్దతిచ్చాయి.