శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:01 IST)

ఏపీలో మొత్తం కరోనా మృతులు 14,125

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,125కు చేరింది. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 20,45,657గా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,307 కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 1,167 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
 
ఈ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 224, చిత్తూరు జిల్లాలో 167, నెల్లూరు జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 130 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు గుర్తించారు.
 
అదే సమయంలో 1,487 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. మరో 20,18,324 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా 13,208 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,125కి పెరిగింది.