ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:09 IST)

దేశంలో కొత్తగా 31 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 31382 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 318 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 32,542 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 3,00,162గా ఉంది. 
 
అలాగే కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,46,368గా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా 84,15,18,026 మంది టీకా తీసుకున్నారు. 
 
మరోవైపు, ఏపీలో గురువారం లెక్కల ప్రకారం కొత్తగా 136 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా నుంచి మరో 58 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 998 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు చేశారు.