1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media Bullitin on Covid Positive Cases

దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Covid Positive Cases
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, క్రియాశీలక కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ వైరస్ బారనపడి 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా, 4.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేరళలో 15 వేలు, మహారాష్ట్రలో 3 వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. అయితే, దేశ వ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. 
 
ప్రస్తుతం దేశంలో 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు ఆఖరులో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్‌ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధ్యనాటికి క్షీణించింది. 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థల నుండి రూ.57 కోట్ల సాయo