1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I feel ashamed for realizing it so late: L.B. Sriram

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

P. Sunil Kumar Reddy, L. B. Sriram
P. Sunil Kumar Reddy, L. B. Sriram
సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ఇటీవలే విడుదలైంది.
 
ఈ సందర్భంగా చిత్రం గురించి ఎల్‌.బి. శ్రీరామ్‌ మాట్లాడుతూ... సినిమాలో అయితే జడ్జి స్థానంలో నిలుచున్నాను. కానీ వేదికపైన ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు ఆయన సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. చాలా మల్టీ ట్యాలెంటెడ్‌ ఆయన. జర్నలిజాన్ని సెకండరీగా పెట్టుకుని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోవడం అయిపోయింది.

తెలుగులో ఇలాంటి సినిమా రావడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఈ సినిమాలో నాకు కళ్ళకు గంతలు కట్టారు. జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి వచ్చింది విని చెప్పాలి. కాబట్టి వినాలి.. వినాలి.. వినాలి ఎంత వింటే అంత న్యాయం జరగాలి. ఈ సినిమా వల్ల ట్రాన్స్‌ జండర్స్‌ మీద సదప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఉందా వీరి కథా వాళ్ళ ఆచారాలు అవి ఇన్ని ఉన్నాయా అని నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. స్క్రీన్‌ప్లే కాని అన్నీ బావుంటాయి. ఇలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుకు ఎదగాలి. ఇండస్ట్రీ గుర్తించాలి అని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ అందరికీ చాలా థ్యాంక్స్‌ అన్నారు. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుంది. సీక్వెల్‌ కూడా ఉంటుంది అది కూడా సునీల్‌గారే తీస్తారు అన్నారు.
 
చిత్ర దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ,  ఇలాంటి సినిమా తీసినందుకు నాకు సహకరించిన ముకుంద, దాస్‌గారు చాలా హెల్ప్‌ చేశాను. అందుకు చాలా థ్యాంక్స్‌ అన్నారు. ఈ రోజు యూనివర్స్‌ లెవల్లో ప్రైవేట్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. చాలా యూనివర్సిటీల్లో ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ గురించి అవడగం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి ఆదరణకి థ్యాంక్స్‌. ఆ థ్యాంక్స్‌ ఎల్‌బి శ్రీరామ్‌గారు. స్క్రీప్ట్‌ పూర్తిగా లేకపోతే చేయనంటారు. లైలాగారికి, సనాగారికి థ్యాంక్స్‌ తర్వలోనే మిమ్మల్ని అందరీనీ కలవాలని కోరుకుంటున్నాను. 2027లో సెకండ్‌ పార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ